టాలీవుడ్ కాదు బాలీవుడ్ నన్ను కాపాడింది: Taapsee Pannu

by Chukka Sudharani |   (  Updated:2022-11-27 08:15:46  IST  )

స్టార్ నటి తాప్సీ టాలీవుడ్ ఇండస్ట్రీ‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'నేను దేనిగురించైనా మాట్లాడేముందు మంచి-చెడు చూస్తా.

టాలీవుడ్ కాదు బాలీవుడ్ నన్ను కాపాడింది:  Taapsee Pannu
X

దిశ, సినిమా: స్టార్ నటి తాప్సీ టాలీవుడ్ ఇండస్ట్రీ‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 'నేను దేనిగురించైనా మాట్లాడేముందు మంచి-చెడు చూస్తా. చెప్పాల్సిన విషయం ముఖం మీదనే చెప్పేస్తా. నేను ఇలా మాట్లాడటం కొందరికి నచ్చదు. అర్థం చేసుకోకుండా నాకు పొగరు అని కామెంట్ చేస్తారు. అయినా లెక్క చేయను. ఎవరికోసమే నా అభిప్రాయం మార్చుకోలేను. నాకు నచ్చినట్లే ఉంటా. మొదట నాకు సినిమా కథలు ఎలా ఎంచుకోవాలో తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. పాత్ర నాకు తగ్గటుగా ఉందా లేదా చెక్ చేసుకుని సైన్ చేస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్ తనకు మంచి అవకాశాలు ఇచ్చిందని స్పష్టం చేసింది.



Also More......

ఆ విషయంలో అమ్మ పోలికే.. అనుకున్నదే చేస్తా: జాన్వీ Janhvi Kapoor




Next Story