ఆ పనిలో రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడను: Swara Bhasker

by Vinod kumar |   (  Updated:2022-12-06 14:13:46  IST  )

బోల్డ్ బ్యూటీ స్వరా భాస్కర్ పనిలో రిస్క్‌ తీసుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటానంటోంది.

ఆ పనిలో రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడను: Swara Bhasker
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ స్వరా భాస్కర్ పనిలో రిస్క్‌ తీసుకోవడానికి ఎల్లప్పుడూ ముందుంటానంటోంది. అయితే కెరీర్ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు అన్నింటిలో స్పష్టమైన స్పృహ కలిగి ఉంటానన్న ఆమె.. తన ప్రయాణంలో బ్లాక్ బస్టర్‌లు సొంతం చేసుకున్నప్పటికీ తగినంత గుర్తింపు, పని లభించడం లేదని తాజా ఇంటరాక్షన్‌లో చెప్పుకొచ్చింది. పని చేసేటప్పుడు ప్రాణాన్ని పణంగా పెట్టేందుకు వెనకాడనన్న నటి.. 'నా కెరీర్ పరంగా చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఎప్పుడూ బ్యాడ్ రివ్యూస్ అందుకోలేదు. నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఉండకూడదని నిరంతరం తపన పడతా. నేను మంచి నటిని మాత్రమే కాదు సమర్థవంతమైన నటిని కూడా' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది.

READ MORE

నా పనిని అందరూ ఇష్టపడాలని ఎన్నడూ ఆశించలేదు: Farhan Akhtar

Next Story