సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ‘పీటర్’ టీజర్ విడుదల.. ఉత్కంఠను రేకెత్తించేలా సీన్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 16:03:22  IST  )

సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌ జానర్. ఈ జానర్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పీటర్’(Peter).

సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ‘పీటర్’ టీజర్ విడుదల.. ఉత్కంఠను రేకెత్తించేలా సీన్స్
X

దిశ, సినిమా: సస్పెన్స్, థ్రిల్లర్ అనేది ఎప్పుడూ ఎవర్ గ్రీన్‌ జానర్. ఈ జానర్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పీటర్’(Peter). రాజేష్ ధ్రువ(Rajesh Dhruva) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వి రాయల(Janvi Rayala), రవిక్ష శెట్టి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. వృద్ధి స్టూడియోస్ బ్యానర్‌పై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మిస్తుండగా.. సుకేష్ శెట్టి రచించి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం.. ఎవరైనా అవమానిస్తే ఊరుకోను’ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠను రేకెత్తించేలా సాగింది. ‘పీటర్’ టీజర్‌ను గమనిస్తే కేరళ సంప్రదాయం, కేరళ అందాల్ని అద్భుతంగా చూపించినట్టు కనిపిస్తోంది.

టీజర్ కట్ చేసిన విధానం చూస్తుంటే.. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో మరో అద్భుతమైన చిత్రం రానున్నట్టుగా అనిపిస్తోంది. ఈ టీజర్‌లో చూపించిన విజువల్స్, భయపెట్టేలా చూపించిన కెమెరా యాంగిల్స్, వెంటాడే నేపథ్య సంగీతం అన్నీ కూడా హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. పీటర్ కథ ఏంటి? జెస్సీ ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలకు త్వరలోనే సమాధానం రానుంది. రాజేష్ ధ్రువ సినిమాలో ఇంటెన్స్ పర్ఫామెన్స్‌తో, అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించబోతోన్నాడని అర్థం అవుతోంది. ‘పీటర్’ త్వరలోనే రిలీజ్‌ కానుంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఇతర అప్డేట్‌లను మేకర్లను త్వరలోనే ప్రకటించనున్నారు.

Next Story