కథ వెనుక కథ.. మార్చి 24న విడుదల

by Disha Web Desk 7 |
కథ వెనుక కథ.. మార్చి 24న విడుదల
X

దిశ, సినిమా: దండమూడి బాక్సాఫీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైత‌న్య ద‌ర్శక‌త్వంలో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మార్చి 24న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకనిర్మాతలు.. డైరెక్టర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడి లక్ష్యం ఓ అమ్మాయి కారణంగా ఎలాంటి మలుపు తిరిగిందనే కథ ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. ఇక సినిమాలోని పాట‌ల‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపిన మేకర్స్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నట్లు చెప్పారు.


Next Story

Most Viewed