ఉత్కంఠ రేపుతున్న 'భూతద్దం భాస్కర్ నారాయణ' టీజర్

by Disha Web Desk 10 |
ఉత్కంఠ రేపుతున్న భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్
X

దిశ, సినిమా: శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ మూవీ 'భూతద్దం భాస్కర్ నారాయణ'. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'చనిపోయిన పదహారు మంది తలలు ఏమైపోయాయన్నది ఎవరికీ తెలియదు. 18 ఏళ్లుగా ఫిర్యాదు చేసిన వారెవరూ లేరు' అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ఇక ఈ కిల్లర్‌ను పట్టకోవడం కోసం డిటెక్టివ్‌గా హీరో రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది. కిల్లర్ హత్య చేసిన వారి బాడీ నుంచి తల మాత్రమే తీసుకుపోతున్నాడు. మరీ తలలు మాత్రమే అతను ఎందుకు పట్టుకుని వెళుతున్నాడు? అనేది సస్పెన్స్. ఇక హీరో ఆ హంతకుడిని ఎలా పట్టుకుంటాడనేది మూవీలోనే చూడాలి. రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 31న విడుదలకానుంది.

READ MORE

అందాల తరాల సోయగాలు



Next Story

Most Viewed