ఆ క్షణాలు గుర్తొస్తే కన్నీళ్లు ఆగవు: 29ఏళ్ల మిస్ యూనివర్స్ కిరీటంపై సుస్మిత

by Disha Web Desk 9 |
ఆ క్షణాలు గుర్తొస్తే కన్నీళ్లు ఆగవు: 29ఏళ్ల మిస్ యూనివర్స్ కిరీటంపై సుస్మిత
X

దిశ, సినిమా: మిస్ యూనివర్స్ విజేతగా నిలిచి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసింది సుస్మితసేన్. 1994లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని 18 ఏళ్లకే కిరీటాన్ని గెలుచుకున్న నటి.. భారతదేశానికి చెందిన మొట్ట మొదటి మిస్ యూనివర్స్‌‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సరిగ్గా ఈ మే 21నాటికి 29ఏళ్లు కంప్లీట్ అయినట్లు తెలుపుతూ తన యుక్త వయసుకు సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది.. ‘ఫ్యాషన్ అండ్ ఫైన్ ఆర్ట్ ఫొటో‌గ్రాఫర్ ప్రబుద్ధ దాస్‌గుప్తా.. 18ఏళ్ల వయస్సులోనే నన్ను అందంగా తీర్చిదిద్దాడు. అందుకు కృతజ్ఞతలు. నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించి గెలుపొందడం చాలా గొప్పగా, గౌరవంగా ఫీల్ అవుతున్నా. ఈ రోజు కూడా ఆ ఆనంద క్షణాలు నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి’ అంటూ ఎమోషనల్ అయింది.

Next Story

Most Viewed