తనకు తానే కాస్లీ గిఫ్ట్ ఇచ్చుకున్న నటి.. ఏంటో తెలుసా?

by Disha Web Desk 10 |
తనకు తానే కాస్లీ గిఫ్ట్ ఇచ్చుకున్న నటి.. ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ నటి సుస్మితా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల లవ్ ఎఫైర్ల కారణంగా హాట్ టాపిక్‌గా మారుతున్న బ్యూటీ.. తాజాగా విలాసవంతమైన కారును కొనుగోలు చేసి తనకు తాను గిఫ్ట్‌గా ఇచ్చుకుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ 'బ్యూటీ అండ్ ది బీస్ట్' అని క్యాప్షన్ ఇచ్చిది. కాగా అంతకు ముందు కూడా కారుకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేస్తూ.. 'డ్రైవింగ్ అంటే ఇష్టమున్న మహిళ తనకు తానుగా పవర్ ఫుల్ బ్యూటీని గిఫ్ట్‌గా ఇచ్చుకుంది. ఐ లవ్ యూ' సుస్మిత అని మురిసిపోయింది. ఇక 'సేన్ మెర్సిడెస్ ఏఏమ్‌జీ జీఎల్‌ఈ 53 కూపే' కారు ధర రూ.1.63 కోట్లు ఉన్నట్లు తెలుస్తుండగా ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. చివరగా కెరీర్ విషయానికి ప్రస్తుతం 'ఆర్య 3' షూటింగ్‌లో బిజీగా ఉంటోంది సుస్మితా.

ఇవి కూడా చదవండి : " వారసుడు " సినిమాపై అలిగిన రష్మిక.. ఎందుకో తెలుసా ?

Next Story

Most Viewed