సుశాంత్‌ చనిపోలేదు.. చంపేశారు: స్పష్టం చేసిన హాస్పిటల్ ఉద్యోగి

by Disha Web Desk 7 |
సుశాంత్‌ చనిపోలేదు.. చంపేశారు: స్పష్టం చేసిన హాస్పిటల్ ఉద్యోగి
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సుశాంత్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియక అభిమానులు ఆందోళన చెందారు. ఈ సంఘటన జరిగి రెండున్నరేళ్లు గడుస్తుండగా సుశాంత్ సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వ్యక్తి రూప్ కుమార్ షా తాజాగా సంచలన విషయాలు వెల్లడించాడు. 'నాకు తెలిసి ఇది ఆత్మహత్య కాదు. ఒక మర్డర్‌. నేను సుశాంత్ బాడీ మీద కొన్ని గాయాలు గమనించాను. అతని మెడపై కూడా ఏవో మరకలున్నాయి. ఇది ఆత్మహత్య కాదని సందేహం కలిగింది. పై అధికారులకు చెప్పాను. పోస్టుమార్టం వీడియో రికార్డు చేయాలనుకున్నప్పటికీ వద్దన్నారు. కేవలం ఫొటోలు తీసుకుని పోలీసులకు బాడీ అప్పగించమన్నారు' అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో నటుడు షీజాన్‌ఖాన్‌ అరెస్ట్

Next Story

Most Viewed