దిల్ రాజ్ బ్యానర్ పై సూర్య మూవీ..! డైరెక్టర్ ఎవరంటే..?

by I. Sairam |   (  Updated:2026-02-07 05:52:01  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) మనందరికీ సుపరిచితమే. ఇతను కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

దిల్ రాజ్ బ్యానర్ పై సూర్య మూవీ..! డైరెక్టర్ ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) మనందరికీ సుపరిచితమే. ఇతను కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి(Venkey Atluri) డైరెక్ష‌న్‌లో సూర్య 46 (Suriya-46) అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేం మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. సీనియర్ నటి రవీనా టాండన్‌(Raveena Thandan) కీలక పాత్ర పోషిస్తోంది.

జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశి(Naga Vamshi), సాయి సౌజ‌న్య(Sai Soujanya) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో ఈ మూవీ పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే సూర్య మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రెండేళ్ల క్రితం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో ద ఫ్యామిలీ స్టార్ సినిమాను తెరకెక్కించి పరాజయం పాలైన డైరెక్టర్ పరుశురామ్(Parasuram).. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని టాక్. ద ఫ్యామిలీ స్టార్‌ని నిర్మించిన దిల్ రాజునే సూర్య - పరుశురామ్ సినిమాను కూడా నిర్మించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దిల్ రాజు సూర్య - పరుశురామ్ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతంఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘యానిమల్’ సినిమా సె*క్స్ సీన్ల వల్లే హిట్ అయిందా? సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్

Next Story