- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘యానిమల్’ సినిమా సె*క్స్ సీన్ల వల్లే హిట్ అయిందా? సంతోష్ శోభన్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple friendly).

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’(Couple friendly). లివింగ్ రిలేషన్‌షిప్ నేపథ్యంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న సంతోష్, సమాజంలో మారుతున్న విలువలపై మరియు సినిమాలపై ప్రేక్షకుల దృక్పథంపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మనం ప్రస్తుతం మంచి విషయాలను వదిలేసి, కేవలం చెడ్డ వాటినే నేర్చుకుంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల విజయంపై విశ్లేషిస్తూ సంతోష్ ఆసక్తికరమైన ఉదాహరణలు ఇచ్చారు. "హాలీవుడ్ మూవీ Barbie అంత పెద్ద హిట్ అయ్యిందంటే అది కేవలం బొమ్మల మీద తీసిన సినిమా అని కాదు, దాని వెనుక ఉన్న సందేశం ముఖ్యం.
అలాగే, సందీప్ రెడ్డి వంగా తీసిన Animal సినిమా అంతగా వర్కవుట్ అయ్యిందంటే.. అది కేవలం అందులో చూపించిన సెక్స్ వల్ల మాత్రమే కాదు. కానీ జనం మాత్రం తప్పుడు విషయాలను త్వరగా వంటబట్టించుకుంటున్నారు. మనం సరైన విషయాలను మాత్రమే నేర్చుకోవాలి" అంటూ సంతోష్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. కాగా.. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రస్తుత తరం యువత ఆలోచనలకు అద్దం పడుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సంతోష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, కొందరు ఆయన బోల్డ్ స్టేట్‌మెంట్‌ను సమర్థిస్తున్నారు. లివింగ్ రిలేషన్‌షిప్ వంటి సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. మరి వాలెంటైన్స్ డే రేసులో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






