Suriya: మురుగన్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సూర్య.. ఎక్జైటింగ్ అప్డేట్ రాబోతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-05 07:44:34  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది.

Suriya: మురుగన్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సూర్య.. ఎక్జైటింగ్ అప్డేట్ రాబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది. గత ఏడాది విడుదలైన ‘కంగువ’ (Kanguwa)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఇక ఇటీవల సూర్య నటించిన ‘రెట్రో’(Retro) చిత్రం కూడా హిట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ సూర్య హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య, వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ‘సూర్య-46’(Suriya 46)మూవీ చేస్తున్నారు.

అయితే దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య సరసన మమిత బైజు (Mamita Baiju)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. అయితే ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, హీరో సూర్, వెంకీ అట్లూరీ, నాగవంశీ కలిసి పళని మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు. గురువారం తెల్లవారు జామున దేవాలయానికి చేరుకున్న ఈ ముగ్గురు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ‘సూర్య-46’ షూటింగ్ జూన్ 9న మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. అందుకే మూవీ టీమ్ అంతా మంచి జరగాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్ట్‌కు ఫస్ట్ మేజర్ స్టెప్ వేస్తున్నాం కాబట్టి దేవుడి ఆశీస్సులు అందుకున్నాము. ఎక్జైటింగ్ అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి’’ అని వెల్లడించారు.

Next Story