- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాఫ్ లో ఉన్న తెలుగు దర్శకుడితో సూర్య మూవీ..యముడు రేంజ్ లో ?
పరశురాం. అలాంటి ఫ్లాప్ దర్శకుడితో సూర్య పెద్ద సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అయి దూసుకు వెళ్తున్నారు. మరికొంతమంది ఒకటి లేదా రెండు సినిమాల్లో సక్సెస్ అందుకొని... డిజాస్టర్లను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో పరుశురాం ఒకరు. దర్శకుడు పరశురాం.. తన కెరీర్ లో గీత గోవిందం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. అంతకు ముందు ఆంజనేయులు, సోలో, సారొచ్చారు ఇలాంటి సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేదు.
కానీ విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మహేష్ బాబుతో సర్కారు వారి పాట, విజయ్ తో ఫ్యామిలీ స్టార్ చేసి కూడా మంచి హిట్ అందుకోలేదు పరశురాం. అలాంటి ఫ్లాప్ దర్శకుడితో సూర్య పెద్ద సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ యముడు లాంటి యాక్షన్ సినిమా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు హీరోయిన్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాత అంటున్నారు.






