Suriya: ‘సూర్య-45’ టైటిల్ ఫిక్స్.. కత్తి పట్టుకుని ఉన్న పవర్ ఫుల్ పోస్టర్‌తో హైప్ పెంచేసిన హీరో

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-20 06:57:51  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది.

Suriya: ‘సూర్య-45’ టైటిల్ ఫిక్స్.. కత్తి పట్టుకుని ఉన్న పవర్ ఫుల్ పోస్టర్‌తో హైప్ పెంచేసిన హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది. ఇటీవల ఆయన నటించిన కంగువ, రెట్రో(Retro) వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాశయం పాలైన విషయం తెలిసిందే. అయినప్పటికీ సూర్య హిట్ , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం సూర్య కమెడియన్ నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji)కాంబోలో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం ‘సూర్య-45’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

తాజాగా, సూర్య ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘కరుప్పు’ (karuppu)అనే పేరు ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్‌లో సూర్య ఓ పెద్ద కత్తిని పట్టుకుని లుంకీలో అంతా రక్తం ఉన్న ప్రదేశంలో నిల్చొని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ భారీ అంచనాల మధ్య రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. త్రిష ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

Next Story