- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'బిగ్ బాస్ 16' ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సురభి.. ట్వీట్ వైరల్
ప్రముఖ టెలివిజన్ నటి, 'నాగిన్ 3' ఫేమ్ సురభి జ్యోతి.. హిందీ 'బిగ్ బాస్ 16'లో పాల్గొంటుందనే పుకార్లపై స్పందించింది.

X
దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటి, 'నాగిన్ 3' ఫేమ్ సురభి జ్యోతి.. హిందీ 'బిగ్ బాస్ 16'లో పాల్గొంటుందనే పుకార్లపై స్పందించింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయబోతున్న ఈ రియాలిటీ షో అక్టోబర్ 1న ప్రారంభం కానుండగా.. ఇంకా కంటెస్టెంట్ల పేర్లను వెల్లడించలేదు. కానీ ఈ సీజన్‌లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై నెట్టింట గెస్సింగ్ గేమ్ కొనసాగుతోంది. అందులో భాగంగానే సురభి పేరును హైలెట్ చేస్తున్న క్రమంలో తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన నటి.. 'మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను 'బిగ్ బాస్' చేయడం లేదు' అంటూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుండగా.. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యామంటూ కామెంట్లు చేస్తున్నారు.
Next Story






