Rajinikanth ' బాబా' రీ రిలీజ్.. సరికొత్త క్లైమాక్స్ యాడ్ చేస్తున్న మేకర్స్..!

by Dishanational4 |
Rajinikanth  బాబా రీ రిలీజ్.. సరికొత్త క్లైమాక్స్ యాడ్ చేస్తున్న మేకర్స్..!
X

దిశ, సినిమా: కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాల్లో, కొన్ని సినిమాలు థియేటర్‌లో సరిగ్గా ఆడనప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి మూవీస్‌లో 'బాబా' ఒక్కటి. కాగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలిష్ అండ్ డివోషనల్ చిత్రం గత రెండు దశాబ్దాల క్రితం రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు నడుస్తున్న రీరిలీజ్ ట్రెండ్‌లో భాగంగా 'బాబా' మూవీని కూడా రిలీజ్ చేయనున్నట్లు తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. కాకపోతే ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన చిత్రంలో మహా అయితే మూవీ క్వాలిటీలో చేంజెస్ చేశారు కానీ మూవీ కథను మాత్రం మార్చలేదు. కానీ 'బాబా' మూవీ రీరిలీజ్‌లో ఈ మూవీ ఫస్ట్ క్లైమాక్స్ కాకుండా, మరో కొత్త క్లైమాక్స్‌ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. కాగా ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

Read More : హీరోయిన్ హన్సిక పెళ్లి పనులు షూరు..

Next Story

Most Viewed