‘మన దగ్గర మాటలుండవ్ కోతలే’ అంటూ ఆసక్తి పెంచేసిన రజినీ కాంత్ ‘JAILER - Official ShowCase

by Disha Web Desk 6 |
‘మన దగ్గర మాటలుండవ్ కోతలే’ అంటూ ఆసక్తి పెంచేసిన రజినీ కాంత్ ‘JAILER - Official ShowCase
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. దీసిని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, సునీల్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, జాక్రీష్రాప్, శాండల్‌వుడ్ స్టార్ శివరాజ్ కుమార్, మోహన్ లాల్, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తాజాగా, ‘జైలర్’ ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. అందులో ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే’ అని రజినీకాంత్ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత హైప్‌ను పెంచేశాయి. దీంతో ఈ చిత్రం కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



Next Story

Most Viewed