Mahesh Babu :చాలా రోజుల తర్వాత న్యూ లుక్‌లో మహేష్ బాబు

by Disha Web Desk 12 |
Mahesh Babu :చాలా రోజుల తర్వాత న్యూ లుక్‌లో మహేష్ బాబు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మిక మరణం మహేష్ బాబును ఎంతగానో కృంగదీసింది. 2022 లో వరుసగా అన్న రమేష్ బాబు, ఆ తర్వాత అమ్మ ఇందిరా దేవి, తాజాగా సూపర్ స్టార్ కృష్ణ వరుస మరణాలు మహేష్ బాబును కోలుకోలేకుండా చేశాయి. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు ఫ్యాన్స్. ఒక రకంగా ఘట్టమనేని కుటుంబానికి 2022 వెరీ వెరీ బ్యాడ్ ఇయర్ అని చెప్పాలి. రీసెంట్‌గా తండ్రి కృష్ణ అపర కర్మలు పూర్తి కావడంతో మహేష్ బాబు తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇందులో భాగంగా ముందుగా 'మౌంటైన్ డ్యూ' కొత్త యాడ్‌లో నటించడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని తెలుపుతూ మహేష్ ఓ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు. ఇందులో లాంగ్ హెయిర్‌తో కనిపిస్తుండగా 'బ్యాక్ టు వర్క్' అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.

Next Story