Dude OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-10 05:05:44  IST  )

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు.

Dude OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు. చేసింది రెండు, మూడు సినిమాలే అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల ‘డ్రాగన్’ చిత్రంతో వచ్చి ఘన విజయం సాధించిన ప్రదీప్ ‘డ్యూడ్’(Dude)తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇందులో మమిత బైజు (Mamita Baiju)హీరోయిన్‌గా నటించగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై..సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు విడుదలైన అన్ని భాషల్లో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. దీపావళి బరిలో ఉన్న మాస్ జాతర, తెలుసు కదా వంటి చిత్రాలను ఓడించి హిట్‌గా నిలిచింది. ఇక లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంది.

దీంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో.. ‘డ్యూడ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై స్పష్టతనిస్తూ.. ప్రముఖ సంస్థ అఫీషియల్ ప్రకటన చేసింది. ‘డ్యూడ్’ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. నవంబర్ 14 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది. పరిష్కారం లేని సమస్యలతో.. ‘డ్యూడ్’ రాబోతున్నాడని తెలుపుతూ ప్రదీప్ రంగనాథన్ చాక్లెట్ తింటున్న పోస్టర్‌తో సినీ ప్రియులను సంతోషపెట్టారు.

link

Next Story