- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. చిరంజీవి- బాబీ మూవీ స్టార్ట్ ఎప్పుడంటే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతూ మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్న ఈ సినిమా.. మెగాస్టార్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. అయితే చిరు ప్రజెంట్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.
దర్శకుడు బాబీ కొల్లితో మెగాస్టార్ మళ్లీ కలవనున్నాడనే వార్తలు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజా సమాచారం ప్రకారం, చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందట. ఇక దీనికి ముందు చిరంజీవి విశ్వంభర పై దృష్టి పెట్టి VFX పనులను పర్యవేక్షిస్తారట.
అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా సాగుతున్నాయని టాక్. కాగా ఈ మూవీలో కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కథలో కీలక పాత్ర పోషించనున్నాయట. మెగాస్టార్‌ను కొత్త కోణంలో ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు బాబీ ప్రత్యేకంగా ఈ కథను రూపొందించినట్లు తెలుస్తోంది.






