- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. ‘ది జెయింట్’లో పవర్ ఫుల్ పాత్ర కొట్టేసిన హాట్ బ్యూటీ!
ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అమెరికాకు చెందిన ‘ది జైంట్’ (The Giant) అనే వెబ్ సిరీస్‌లో సన్నీ ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారు.

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషన్ సన్నీ లియోన్ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘కెన్నెడీ’ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. అమెరికాకు చెందిన ‘ది జైంట్’ (The Giant) అనే వెబ్ సిరీస్‌లో సన్నీ ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారు. హాలీవుడ్ నటుడు కెవిన్ బి ప్లాత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సిరీస్‌లో సన్నీ లియోన్ క్వానా డీర్లీఫ్ అనే రిజర్వేషన్ షెరీఫ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన సన్నీ, ఈసారి ఖాకీ డ్రెస్ వేసుకుని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మెరవబోతుండటం విశేషం. ఈ సిరీస్‌ను మాజీ సైనికోద్యోగులు నడిపే ఆర్టెమిస్ థియేట్రికల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి సన్నీ మాట్లాడుతూ.. "ఇది నేను గతంలో చేసిన వాటికంటే చాలా భిన్నమైన పాత్ర. పూర్తిగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా శాయశక్తులా కృషి చేస్తాను. నేను ఈ పాత్రను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో, నా అభిమానులు కూడా స్క్రీన్ మీద చూసి అంతే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని తన సంతోషాన్ని పంచుకున్నారు. కాగా.. హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో పాటు సన్నీ చేతిలో మరికొన్ని ఆసక్తికర చిత్రాలు ఉన్నాయి. ఇటీవల తెలుగులో ‘త్రిముఖ’ చిత్రంతో పలకరించిన ఈ భామ, ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతోంది. ‘రంగీలా’ సినిమాతో మలయాళ ఎంట్రీ ఇస్తుండగా, ఆ తర్వాత ‘షెరో’ అనే థ్రిల్లర్ చిత్రంలో నటించనుంది. హిందీలో ‘హెలెన్’ మూవీతో పాటు, చారిత్రాత్మక చిత్రం ‘ది బ్యాటిల్ ఆఫ్ భీమా కోరేగావ్’లో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోంది. మొత్తానికి సన్నీ లియోన్ గ్లోబల్ వైడ్ గా తన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.






