- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వేషాధారణలో గణేశుడిని దర్శించుకున్న పోర్న్‌స్టార్.. వీడియో వైరల్
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ సంప్రదాయ వస్త్రధారణలో గణేశుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.

X
దిశ, సినిమా: మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ సంప్రదాయ వస్త్రధారణలో గణేశుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది. ఇండియన్ కల్చర్ అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలుసార్లు వెల్లడించిన ఆమె.. తాజాగా చెప్పినట్లుగానే సంప్రదాయ చీరకట్టులో గణేశ్ చతుర్థి ఉత్సవాల్లో పాల్గొంది. ఈ మేరకు ముంబై లాల్‌బాగ్‌లోని గణేశుడిని దర్శించుకోవడానికి వచ్చిన సన్ని.. గులాబీ రంగు చీరలో తన భర్త డానియల్ వెబర్‌తో గణనాథుడికి పూజలు నిర్వహించింది. అయితే ఓ వైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా గణేశుడి దగ్గరకు నడుచుకుంటూ వచ్చిన సన్నీ లియోన్‌ను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా సన్నీ ప్రవర్తనను ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.
Next Story






