పెళ్లై, ఇద్దరు పిల్లలున్న యూట్యూబర్‌తో యంగ్ హీరోయిన్ ప్రేమాయణం.. అధికారికంగా ప్రకటించేసింది..

by Sujitha Rachapalli |

టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల ద్వారా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ సునయన ప్రేమలో పడినట్లు ప్రకటించింది. అది కూడా ఇండియన్‌తో కాదు యూఏఈకి చెందిన యూట్యూబర్‌తో లవ్‌లో మునిగి తేలుతుంది. యూఏఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఖాలిద్ అల్ అమెరీ తన బర్త్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్‌తోఈ విషయంపై క్లారిటీ వచ్చింది.

పెళ్లై, ఇద్దరు పిల్లలున్న యూట్యూబర్‌తో యంగ్ హీరోయిన్ ప్రేమాయణం.. అధికారికంగా ప్రకటించేసింది..
X

దిశ, సినిమా : టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల ద్వారా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ సునయన ప్రేమలో పడినట్లు ప్రకటించింది. అది కూడా ఇండియన్‌తో కాదు యూఏఈకి చెందిన యూట్యూబర్‌తో లవ్‌లో మునిగి తేలుతుంది. యూఏఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఖాలిద్ అల్ అమెరీ తన బర్త్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్‌తోఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఖాలిద్, సునయనతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తుండగా.. వీరిమధ్య ప్రేమ పుట్టినట్లు తెలుస్తోంది. దీంతో తన బర్త్ డేన ఖాలిద్.. ‘నా బ్యూటిఫుల్ బర్త్ డేకు విష్ చేసిన బ్యూటీకి థాంక్స్’ అంటూ దుబాయ్‌లో చేతిలో చేయి వేసిన ఫొటోలు పంచుకున్నాడు. అలాగే సునయన కూడా మై లవ్ అంటూ ఇద్దరి ఫొటోలు పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ క్యూట్ కపుల్ అంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు. త్వరలో పెళ్లి జరుగుతుందనే ప్రచారం కూడా అవుతోంది. అయితే సునయనకు ఇది మొదటి పెళ్లి కాగా ఖాలిద్‌కు మాత్రం రెండోది. ఇప్పటికే 2024లో భార్య సల్మాతో విడాకులు తీసుకున్న అతనికి ఇద్దరు పిల్లలు కూడా.

Next Story