దర్శకుడిగా విజయ్ తనయుడు.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay)దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.

దర్శకుడిగా విజయ్ తనయుడు.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay)దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను తమిళ చిత్ర అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌(Sundeep Kishan)ను ఫైనల్ చేశారు. ఈ చిత్రం ‘జేసన్ సంజయ్-01’ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృందం సందీప్ కిషన్, జేసన్ కాంబోలో రాబోతున్న టైటిల్, ఫస్ట్ లుక్ షేర్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘సిగ్మా’ (Sigma)టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ.. సందీప్ కిషన్ డబ్బు కట్టలు, గోల్డ్ బార్లు, ఏనుగు దంతాలు, ఇలా కోట్ల విలువైన నిధి కుప్పపై కూర్చొని చాలా రఫ్ అండ్ రగ్గడ్ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు.

అతని బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ లుక్ చూస్తుంటే ఇది పక్కా యాక్షన్ ఫీస్ట్ సినిమా అని అర్థమవుతోంది. ఇంత పెద్ద నిధి కోసం సందీప్ కిషన్ వేట ఎలా ఉంటుందనేది పోస్టర్‌తోనే అంచనాలను పెంచారు. ఇక ఇందులో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మగ లక్ష్మి సుదర్శన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే 95 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు సమాచారం.

జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. ‘‘సిగ్మా నిర్భయమైన, స్వతంత్ర స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. అతను సామాజిక నిబంధనలకు అతీతంగా తన సొంత మార్గాన్ని అనుసరించే ఒక విచిత్రమైన వ్యక్తి. నిధి వేటలు, దోపిడీలు, కామెడీ వంటి అంశాలతో రాబోతుంది. నేను అదృష్టవంతుడిని. సందీప్ కిషన్, తమన్, సుభాస్కరణ్ మద్దతు లేకుండా, షెడ్యూల్‌ను సమయానికి పూర్తి చేయడం సాధ్యం కాదు. ఒక పాట మాత్రమే మిగిలి ఉన్నందున, మేము పోస్ట్-ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాం. వేసవి ప్రారంభంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని చెప్పుకొచ్చారు.

link

Next Story