- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సుందరకాండ’ ఒక మంచి జ్ఞాపకంలా ఉంటుంది: నారా రోహిత్
టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ‘భైరవం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సుందరకాండ’(Sundarakanda). నిమ్మలపూడి వెంకటేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్(Sridevi Vijay Kumar), వ్రితి వాఘావి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నరేష్ విజయ కృష్ణ(Naresh Vijaya Krishna), వాసుకి ఆనంద్, సత్య, అజయ్, అభినవ్, వీటివీ గణేష్, సునైనా, రఘుబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనిని సందీప్ పిక్చర్స్ ప్రాలెస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్స్‌లో రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న నారా రోహిత్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘సుందరకాండ ఆగస్టు 27న మీ ముందుకు రాబోతుంది.
ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఆడియన్స్‌కు థాంక్స్. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా వెళ్లి చూడొచ్చు. సినిమా స్టార్టింగ్ లోనే మా డైరెక్టర్‌తో ఒకటే చెప్పా.. ఏది ఎలా ఉన్నా సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కు టీమ్ అంతా హ్యాపీగా ఉంటే సినిమా సక్సెస్ అయినట్టే అని అన్నాను. అలాగే ఈరోజు మా టీమ్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. గత ఏడాది వినాయక చవితికి వద్దామని అనుకున్నాము. అనుకున్నట్లుగానే ఈ ఏడాది వినాయక చవితికి రాబోతున్నాము. ‘సుందరకాండ’ మా టీమ్ మొత్తానికీ ఒక మంచి జ్ఞాపకంలా ఉంటుంది. అలాగే మా మూవీ టీజర్ విడుదల చేసిన ప్రభాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.






