- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సుందరకాండ’ మూవీ అప్డేట్.. ఈ లాంచ్‌కు గొప్ప గర్జన అవసరమంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith)చాలా రోజుల తర్వాత ‘భైరవం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్ (Nara Rohith)చాలా రోజుల తర్వాత ‘భైరవం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన 20న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకటేష్ నిమ్మలపూడి(Venkatesh nimmalapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘సుందరకాండ’ పేరుతో రాబోతుంది. సందీప్ పిక్చర్స్ ప్యాలెస్ బ్యానర్‌నపై సంతోష్ , చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకల్లి నిర్మిస్తున్నారు. రెండు విభిన్న ప్రేమకథల కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్(Sridevi Vijay Kumar), వ్రితి వాఘాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, హాస్యనటుడు సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం, విశ్వంత్, రూపలక్ష్మి, సునైనా, రఘు బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘సుందరకాండ’ ట్రైలర్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘టీజర్ మార్చిపోయారా? ట్రైలర్ చూశాక ‘సినిమా ఎప్పుడు?’ అనే ఎక్సైట్‌మెంట్‌ను క్రియేట్ చేస్తాము. ఆగస్టు 11న సాయంత్రం 5:02 గంటలకు రాబోతుంది. వినోదభరితమైన భావోద్వేగాలను కలిగిన ఉంటుందని హామీ ఇస్తున్నాము. ఈ లాంచ్‌కి రాజు తరహా గర్జన కావాలి. కాబట్టి గెస్ట్ ఎవరా అని.. మీరంతా ఊహిస్తూ ఉండండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ అనౌన్స్‌మెంట్స్ వీడియో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






