నా ఫస్ట్ పీరియడ్స్‌కు నాన్న సాయం.. రుతుక్రమంపై యంగ్ బ్యూటీ

by Disha Web Desk 7 |
నా ఫస్ట్ పీరియడ్స్‌కు నాన్న సాయం.. రుతుక్రమంపై యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సుంబుల్ తౌకీర్ తన మొదటి పీరియడ్ ఎక్స్‌పీరియన్స్‌పై ఓపెన్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరీర్, ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న ఆమె.. తనకు ఫస్ట్ పీరియడ్స్ వచ్చినపుడు తన తండ్రి తౌకీర్ హసన్ ఖాన్ మార్గనిర్దేశం చేశాడని చెప్పింది.

‘నాకు బ్లీడింగ్ అవుతుందని మా నాన్నకు చెప్పాను. దీంతో అయనే నాకు దగ్గరుండి సహాయం చేసాడు. ఈ విషయంలో నేనెప్పుడూ అసౌకర్యంగా ఫీల్ అవలేదు. అభద్రతగానూ భావించలేదు. నాన్న కూడా ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపించలేదు. నా పట్ల చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. నిజానికి ఒక పురుషుడు ఇలాంటి సమయంలో మహిళకు మద్దతుగా ఉండటం ఎంత భిన్నంగా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ అలాంటి సందర్భాలు చూడలేదు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.

Also Read: మరో పచ్చబొట్టు వేయించుకున్న శ్రుతిహాసన్.. ఇసారి ఎక్కడంటే?

Next Story

Most Viewed