శిష్యుల‌తో సుకుమార్ భారీ ప్లానింగ్‌..ఏకంగా ఇద్ద‌రు యువ హీరోల‌తో !

by velandi.Saikiran |   (  Updated:2025-10-21 07:18:02  IST  )

సుకుమార్ తన ఇద్దరు శిష్యులతో ఈ సినిమాలు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కిరణ్ అబ్బవరంతో ఒక సినిమా ఫైనల్

శిష్యుల‌తో సుకుమార్ భారీ ప్లానింగ్‌..ఏకంగా ఇద్ద‌రు యువ హీరోల‌తో !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ గురించి తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగిన దర్శకుడు సుకుమార్. స్మగ్లింగ్ పై సినిమా తీసిన కూడా జనాలు ఎగబడి చూశారు. అంత అద్భుతంగా కథ రాస్తాడు సుకుమార్. అయితే అలాంటి సుకుమార్ రైటింగ్స్ లో రెండు కొత్త సినిమాలు రాబోతున్నాయట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తన ఇద్దరు శిష్యులతో ఈ సినిమాలు చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో కిరణ్ అబ్బవరంతో ఒక సినిమా ఫైనల్ అయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

దీనికి సుకుమార్ శిష్యులు వీరా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ తో మరో సినిమా కూడా ఓకే చేశారట. దీనికి మాధురి అనే అమ్మాయి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈమె కూడా సుకుమార్ శిష్యురాలే కావడం గమనార్హం. ఈ సినిమాలన్నీ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రొడక్షన్ లోనే వస్తాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అటు ఇప్పటికే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు, చరణ్ హీరోగా పెద్ది సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సుకుమార్ శిష్యులే ఇండస్ట్రీని వెళ్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

READ MORE .....

మ‌హేష్‌-జ‌క్క‌న్న మూవీ నుంచి బిగ్ అప్డేట్‌..టైటిల్‌, గ్లింప్స్ లోడింగ్‌ !

Next Story