- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రాబోతున్న సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. అధికారిక ప్రకటన విడుదల
‘హే బలవంత్’ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.

దిశ, సినిమా: కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి చిత్రాలతో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన సుహాస్, ఇటీవల ‘హే బలవంత్’ చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు. ఫిబ్రవరి 20న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేటర్లలో మిస్ అయిన వారందరి కోసం జీ5 ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 31 నుండి ‘హే బలవంత్’ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. సుహాస్ నటనకు తోడు శివాని నాగరం అందం, అభినయం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, కమెడియన్ సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. కథ అంతా చాలా సహజంగా, కామెడీ ప్రధానంగా సాగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ మొదలవుతున్న క్రమంలో, ఇంటిల్లి పాదీ కలిసి నవ్వుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. థియేటర్లలో కంటే ఓటీటీలో సుహాస్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది, కాబట్టి ‘హే బలవంత్’ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.






