- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నో స్కాన్.. ఓన్లీ క్యాష్ అంటున్న సుహాస్.. క్యూఆర్ కోడ్‌తో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడుగా!
టాలీవుడ్ హీరో సుహాస్ (suhas) ‘కలర్ ఫొటో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుహాస్ (suhas) ‘కలర్ ఫొటో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక అప్పటినుంచి విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇటీవల ఓ భామ అయ్యో రామ’ మూవీ చేశాడు కానీ హిట్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ సుహాస్ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తన నచ్చిన స్టోరీస్ ఒకే చేస్తున్నాడు. ప్రస్తుతం ‘మండాడి’ మూవీతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో ఆయన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, సుహాస్ ఓ కొత్త సినిమాను ప్రకటిస్తూ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, గ్లింప్స్‌ను కూడా షేర్ చేశాడు. ‘హే భగవాన్’ (𝐇𝐄𝐘 𝐁𝐇𝐀𝐆𝐀𝐖𝐀𝐍)టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో సుహాస్, శివాని నాగరం(Shivani Nagaram) జంటగా నటిస్తున్నారు. గోపీ (gopi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ట్రిషు విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్-2గా రాబోతున్న ఈ చిత్రాన్ని కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇక విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుహాస్ స్కానర్‌లో కనిపించగా.. చుట్టూరా చెప్పులు, గ్లాసులో బీర్, రిమోట్స్, టాబ్లెట్స్, చీర, ఓ న్యూస్ పేపర్, షూ, వాకీ టాకీ కూడా ఉంది. ఇందులో ‘‘నో స్కాన్.. ఓన్లీ క్యాష్ అని’’ అని రాసి ఉంది. ఇక గ్లింప్స్ విషయానికొస్తే.. ముందుగా సీనియర్ నటుడు నరేష్ కనిపించి మన ఫ్యామిలీ బిజినెస్ గురించి ఎవరికీ తెలియకూడదు అని అంటాడు.
ఆ తర్వాత సుహాస్ సూటు, బూటు ధరించి కనిపిస్తాడు. ఆ తర్వాత హీరోహీరోయిన్ ఇద్దరూ వారి కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ ప్రేక్షకులను నవ్విస్తారు. ఇక ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సుహాస్ మాట్లాడుతూ.. ‘‘హే భగవాన్ షూటింగ్ మంచి ఫ్లోలో స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్‌గా సుదర్శన్ చేశాడు. శివానీతో నేను రెండో సారి చేస్తున్నాను. ఆమె చాలా మంచి యాక్టర్. ఈ మూవీ తర్వాత మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. లాస్ట్ జరిగిన తప్పటడుగులకి ఈ సినిమా మంచి కంబ్యాక్ అవుతుంది. దాంట్లో డౌటే లేదు. ‘హే భగవాన్’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది చాలా స్ట్రాంగ్‌గా చెబుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.






