సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ఓ పాన్ ఇండియా సినిమా ప్రకటన చేసి అందరిని షాక్‌కు గురి చేశాడు.

సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ఓ పాన్ ఇండియా సినిమా ప్రకటన చేసి అందరిని షాక్‌కు గురి చేశాడు. ఆయన కెరీర్ లో 5 వ సినిమాగా రాబోతుంది. ఈ చిత్రానికి కుమార్‌కోట దర్శకత్వం వహిస్తుండగా.. వజ్రవరాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవి కిరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో సుధీర్ సరసన నక్ష సరన్(Naksha Saran), అక్షర గౌడ(Akshara Gowda), నటాషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. హీరో శివాజి, అనుదీప్, ప్రసాద్, నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి మూవీ మేకర్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ మూవీకి ‘హైలెస్సో’ టైటిల్ ఫిక్స్ చేస్తూ.. ఓ అమ్మవారి రూపంలో ఉన్న ఒక కాలును అన్నంతో ఉన్న విస్తరాకులో పెట్టినట్లు, రక్తం కారుతున్న కత్తిని పట్టుకుని ఉన్న పోస్టర్ షేర్ చేశారు. ఇక ఇందులో మెట్టెలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుపుతూ.. ‘‘మన పవిత్ర దేవుడి భయంకరమైన అవతారంలో రాబోతుంది.. మన సంస్కృతికి సంబంధించిన దైవిక, పాతుకుపోయిన కథ మీ అందరినీ పులకరింపజేయడానికి వస్తోంది. థ్రిల్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.

link

Next Story