- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sudigali Sudheer: అడ్డంగా బుక్కైన సుడిగాలి సుధీర్.. ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయో తెలుసా?
Sudigali Sudheer: తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు

దిశ, వెబ్ డెస్క్: Sudigali Sudheer: తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మ్యాజిక్ షోలతో మొదలై..జబర్దస్త్ స్టేజీపై స్కీట్లతో హడావుడి చేసి..వెండితెరపై హీరోగా, షోలకు హోస్ట్ గా ఎదుగుతూ వచ్చాడు. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు ఏ స్థాయికైనా వెళ్లే సుధీర్..ఎప్పుడూ వివాదాలకు మాత్రం పోలేదు. ఎవరిని కూడా నొప్పించే విధంగా..వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాత్రం స్కిట్స్ చేయలేదు. అలాంటి సుడిగాలి సుధీర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
ఏం జరిగిందంటే..ఈ మధ్యే ఓ ప్రముఖ టీవీ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుధీర్ స్టేజీపై ఓ కామెడీ స్కీట్ చేశాడు. అప్పుడు నందీశ్వరుడి విగ్రహం తెరమీద ఉంది. ఆ విగ్రహం తల భాగం నుంచి చూస్తే శివుడి దర్శనం వచ్చింది అనాలి. కానీ స్కిట్ లో ఆ సందర్భాన్ని అమ్మోరు దర్శనం అంటూ పక్కనే ఉన్న హీరోయిన్ రంభను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఇది కాస్త దుమారం రేపింది. నిజానికి ఈ సీన్ బావగారు బాగున్నారా మూవీలోని ఓ సీన్ స్పూఫ్ గా తీసుకుని చేశారు.
దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిందూ భక్తులు దేవుడిని కించపరిచారు, ధర్మాన్ని హాస్యాస్పదం చేయడం ఎంత వరకు సబబు అంటూ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. బుద్ధిలేదా ఇలాంటి జోకులు అవసరమా అంటూ గడ్డిపెడుతున్నారు. అయితే ఈ విషయంపై సుధీర్ కానీ, షో నిర్వాహకులు కానీ ఇంతవరకూ స్పందించలేదు. కానీ ఈ వీడియో పై విమర్శకులు ఎక్కువయ్యే కొద్దీ స్పందించే అవకాశం కూడా ఉంది.బుల్లితెరపై తన బ్రాండ్ కొనసాగిస్తూ వస్తున్న సుధీర్ కు ఈ వివాదం చిన్నదే కావచ్చు..కానీ సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది.






