- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుడిగాలి సుధీర్ నన్ను అవమానించారు.. చాలా బాధపడ్డానంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఓ వైపు యాంకర్‌గా వ్యవహరిస్తూనే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ‘గోట్’ సినిమా చేస్తున్నాడు.

దిశ, సినిమా: ఓ వైపు యాంకర్‌గా వ్యవహరిస్తూనే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ‘గోట్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తమిళ నటి దివ్య భారతి(Divya Bharati) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ మొదలైన కానుంచి వివాదాలు చుట్టుముట్టాయి. దక్శకుడు, హీరోయిన్ మధ్య వివాదం తలెత్తడంతో మధ్యలో ఈ సినిమాకు పలు అడ్డంకులు వచ్చాయి. హీరోయిన్‌ను పట్టుకుని చిలుకా అనడంతో అసలు విషయం మొదలైంది. దీంతో ఆ దర్శకుడిని ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయినప్పటికీ మూవీ మేకర్స్ షూట్ పూర్తి చేసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, ‘గోట్’ టీజర్ లాంచ్ చేయగా.. సుధీర్, దర్శకుడు మాత్రం డుమ్మా కొట్టారు. ఇక ఇందులో పాల్గొన్న దివ్యభారతి.. సుధీర్ తనను అవమానించాడని ఆవేదన వ్యక్తం చేసింది.
‘‘నన్ను ఇర్రిటేట్ చేయడానికి సుధీర్ చేయబోయే సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందని ఓ డైరెక్టర్ ద్వారా సంప్రదించారు. అలా అడగడం తప్పు కాదు. కానీ సమస్య ఉన్నప్పుడు మాట్లాడకుండా కావాలనే నన్ను టార్గెట్ చేశారు. డైరెక్టర్ నన్ను చిలుకా అని అసభ్యంగా మాట్లాడినప్పటికీ ఈ విషయం సుధీర్ స్పందించకపోవడంతోనే ఆయన పేరును మెన్షన్ చేశాను. ఇది సుధీర్ గారి సినిమా. ఆయన కూడా ఇందులో పని చేశారు. ఆయన మీ ఫ్రెండ్ అని కొందరు.. ట్విట్టర్‌లో నాపై పోస్టులు చేస్తే కూడా స్పందించలేదు. ప్రొడ్యూసర్ తో ఇబ్బంది ఉంటే.. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ, నన్ను ఇన్వాల్ చేయడం సరికాదు. అందుకే నేను ఆయన పేరును ప్రస్తావించాను.
అంతే కానీ, ఆయన నాకు హెల్ప్ చేస్తాడనో, లేదా ఆయనతో నాకు వ్యక్తిగత సమస్య ఉందనో కాదు. అందరూ కలిసి నన్ను అవమానించారు. చిలుకా అంటూ నెగిటివ్‌గా మాట్లాడారు. నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. నన్ను అవమానకరంగా చిత్రీకరించారు. దీంతో నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం స్పందించి పోస్ట్ పెట్టాల్సి వచ్చింది. ఆ ట్వీట్ గురించి టీమ్ మొత్తంలో ఎవరూ కూడా అడగలేదు. చాలా బాధపడ్డాను. దర్శకుడు నరేష్ కుప్పిలి.. నన్ను ఎంత అందంగా చూపిద్దాం అనుకున్నా అందంగా కనిపించడం లేదని అన్నారు. అది అతని అభిప్రాయం కావచ్చు కానీ అందరి ముందు ఆయన అలా అనడం నాకు నచ్చలేదు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా విడుదల వరకూ ఈ వివాదం కొనసాగేలా కనిపిస్తోంది.






