నీ కోసమే ఇప్పటివరకు బతికున్నా.. స్టేజ్ మీదనే Rashmi కి మరోసారి ప్రేమ విషయం చెప్పిన Sudheer

by Disha Web Desk 6 |
నీ కోసమే ఇప్పటివరకు బతికున్నా.. స్టేజ్ మీదనే Rashmi కి మరోసారి ప్రేమ విషయం చెప్పిన Sudheer
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీరం, యాంకర్ రష్మి జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. వీరిద్దరు కలిసి పలు షోస్‌లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. ఇటీవల వీరిద్దరు దూరమయ్యారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ షోలో కలిశారు. బలగం పేరుతో స్పెషల్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో సుడిగాలి సుధీర్ తోపాటు, రష్మి కలిసి యాంకరింగ్‌ చేయడం విశేషం. దీంతో ఈ షోకి మళ్లీ పూర్వ వైభవం వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇద్దరు కలిసి చేసిన రచ్చ ఇప్పుడు హైలైట్ గా నిలుస్తుంది.

ఇందులో సుధీర్‌ తనని వదిలేసి పోవడంపై యాంకర్‌ రష్మి సీరియస్‌గా ఉందట. ఆమె కోపంగా ఉండటాన్ని చూసిన సుధీర్‌.. ఏంటి మేడమ్‌ గారు సీరియస్‌గా ఉన్నారంటూ ప్రశ్నించగా, దానికి రష్మి రియాక్షన్‌ అదిరిపోయింది. నేనసలు గుర్తున్నానా అంటూ కోపంతో అందరిని ముందు సుధీర్‌ని ప్రశ్నించింది. దీనికి సుధీర్‌ పిండేసే ఆన్సర్‌ ఇచ్చాడు. నువ్వు గుర్తున్నావు కాబట్టే ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్నాను అంటూ చెప్పడంతో రష్మి కూల్ అయిపోయింది. ఈ జంట చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సుధీర్ చేసిన కామెంట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

5 ఏళ్లలో స్టార్ నటి చనిపోతుందట..!

Boys Hostelలో స్టే చేసేంత సీన్ లేదంటున్న Rashmi.. ఏజ్ గ్యాప్ ఉందంటూ



Next Story

Most Viewed