మహేష్ బాబు చెల్లితో పెళ్లి జరగడంపై సుధీర్ ఆసక్తికర కామెంట్స్!

by Disha Web Desk 6 |
మహేష్ బాబు చెల్లితో పెళ్లి జరగడంపై సుధీర్ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: మహేష్ బాబు చెల్లి భర్త సుధీర్ బాబు అందరికీ సుపరిచితమే. ఆయన ప్రియదర్శినితో పెళ్లయిన తర్వాత కృష్ణ చిన్న అల్లుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2012లో శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 2013లో ప్రేమ కథా చిత్రమ్‌తో మంచి విజయం అందుకున్నాడు. అయితే సుధీర్ బాబు ఇటీవల మామా మశ్చీంద్ర మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో రెండు మూడు సినిమాతో రాబోతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్.. ప్రియదర్శినితో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ పెళ్లి చూపులకు ముందు రోజు పేపర్లో ఒక ఫొటో వచ్చింది. అందులో ప్రియదర్శిని చాలా లావుగా ఉంది. దాంతో ఆ పిక్ చూసి భయపడిపోయాను. అయితే పెళ్లి చూపులు పెట్టినప్పుడు నేను మా వాళ్లతో కూర్చొని ఉండగా తను కూడా వచ్చి కూర్చుంది. అప్పుడే నేను ఇంకా ఎవరైనా వస్తారా? అని చూస్తున్నాను.

తనే ప్రియ అని మళ్లీ నాకు పేరు చెప్పారు. ఆ తర్వాత నాకు చిరాకు వచ్చి పెద్ద ఫ్యామిలీ అని చెప్పి పెళ్లిచూపులకు రమ్మంటుందా? అని వెంటనే అమ్మతో అన్నాను. అప్పుడు మా అమ్మ ఏంట్రా అసలు నువ్వు పెళ్లి కూతురిని చూడకుండానే ఇవన్నీ అంటున్నావ్ చూస్తేనే కదా తెలిసేది ఆ అమ్మాయి చాలా బాగుందని చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మా పెళ్లి జరిగిపోయింది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

సూపర్‌స్టార్-జక్కన్న సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్


Next Story

Most Viewed