నైట్రో స్టార్ సుధీర్ బాబు “మామా మశ్చీంద్ర” నుండి దుర్గా లుక్ విడుదల

by Dishafeatures2 |
నైట్రో స్టార్ సుధీర్ బాబు “మామా మశ్చీంద్ర” నుండి దుర్గా లుక్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. ఈ చిత్రంలో హీరోని మూడు విభిన్న షేడ్స్ లో చూపించబోతున్నారు హర్షవర్ధన్. దుర్గ, పరశురామ్, డీజే అనే మూడు పాత్రల్లో సుధీర్ బాబు కనిపిస్తారు. కాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఈరోజు దుర్గ లుక్ విడుదల చేశారు. పొడవాటి జుట్టు , గడ్డంతో సుధీర్ బాబు ఇక్కడ కొంచెం లావు గా కనిపిస్తున్నాడు. ఈ పాత్ర ఊబకాయంతో ఉండే వ్యక్తి గా ఉండబోతోందని తెలుస్తోంది. కారు బానెట్ పై కూర్చున్న సుధీర్ బాబు బంగారు గొలుసు వాచ్, ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి విలనీ స్మైల్ తో కనిపించాడు. నైట్రో స్టార్ మేక్ఓ వర్ ఆశ్చర్యం కలిగించేలాగా ఉంది.

సుధీర్ బాబు ఎప్పుడూ విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాత్ర పూర్తిగా విలక్షణమైనదిగా కనిపిస్తుంది. మామా మశీంద్ర అనే టైటిల్ నైట్రో స్టార్ సుధీర్ బాబు మల్టీ షేడ్ క్యారెక్టర్ సూచిస్తుంది. పరశురామ్ లుక్ ని ఈ నెల 4న, డీజే లుక్ ని 7న విడుదల చేయనున్నారు. సృష్టి సెల్యులాయిడ్ కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. వినూత్నమైన కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించబడిన ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు. ఇందులో అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది. చైతన్ భరద్వాజ్ సౌండ్ ట్రాక్ లను అందించగా, పీజీ విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుధీర్ బాబు

రచయిత, దర్శకుడు: హర్షవర్ధన్

నిర్మాతలు: సునీల్ నారంగ్ , పుస్కుర్ రామ్ మోహన్ రావు

ప్రెజెంటర్: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP

సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్

DOP: PG విందా

ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్



Next Story

Most Viewed