Sudheer Babu: సుధీర్ బాబు HUNT సినిమా చేసి తప్పు చేశాడా?

by Disha Web Desk 10 |
Sudheer Babu: సుధీర్ బాబు HUNT సినిమా చేసి తప్పు చేశాడా?
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా అనేది ఈ రోజు అనుకుంటే రేపు అయిపోయేది కాదు. సినిమా పూజ మొదలు పెట్టినప్పటి నుంచి శుభం కార్డు పడే వరకు డబ్బు మీద నడుస్తుంది. కథ విన్నప్పుడు బాగానే ఉంటుంది..కానీ అవుట్ ఫుట్ వచ్చి విడుదలయ్యే వరకు టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది. కొన్ని సినిమాలకు కోట్లు ఖర్చు పెట్టి మరి తీస్తారు.. కానీ ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడతాయి. అందుకే మన హీరోలు రీమేక్ సినిమాల పైన దృష్టి పెడుతున్నారు. ఒకసారి తీసిన సినిమా అయితే మనకి సెట్ అవుతుందో ? లేదో చూసి చెప్పవచ్చు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ముంబాయి పోలీస్ మూవీని సుధీర్ బాబు తెలుగులో సుధీర్ hunt గా తెస్తే.. సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.మలయాళీ రీమేక్ కథలు చూడటానికి బాగున్నా..కానీ అవి అన్ని భాషలకు సెట్ కావని తేలి పోయింది. పర బాష కథలను తీసుకోని మన హీరోలు టైం వేస్ట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి. ఒరిజినల్ స్టోరీని ఫాలో అవ్వకపోవడం వల్లే ప్లాప్ అవుతున్నాయని టాక్ నడుస్తుంది.



Next Story

Most Viewed