Urvashi Rautela: ఇలాంటి ట్రోల్స్ నా విజయాన్ని ఆపలేవు.. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఊర్వశి.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-27 12:53:00  IST  )

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌(Cannes Film Festival)లో బాలీవుడ్ సినీ తారలు స్పెషల్ దుస్తులు ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Urvashi Rautela: ఇలాంటి ట్రోల్స్ నా విజయాన్ని ఆపలేవు.. నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఊర్వశి.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌(Cannes Film Festival)లో బాలీవుడ్ సినీ తారలు స్పెషల్ దుస్తులు ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ఈ వేడుకల్లో బాలయ్య బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) కూడా పాల్గొని సందడి చేసింది. ఇక ఆమె ఇందులో మెట్లపై నిల్చొని ఫొటోలకు పోజులిచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఊర్వశి కేన్స్ వేడుకల్లో పాల్గొన్న వారికి ఇబ్బంది కలిగించిందని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కామన్ సెన్స్ ఉపయోగించకుండా అక్కడ ఫొటోలు దిగడం అవసరమా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, ఈ విషయంపై ఊర్వశి క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టింది. ‘‘నెటిజన్లు కొంతమంది నేను మెట్లపై దారిని బ్లాక్ చేశానంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఫొటోలు దిగడానికి నేను అనుమతి తీసుకున్నాను. కేన్స్ వేడకలో ప్రతి నియమాన్ని పాటించాను. ఎంతో గౌరవంగా ఆ వేడుకలకు హాజరయ్యాను. ఈ విమర్శలకు ప్రధాన కారణం అసూయ మాత్రమే. ఇలాంటి ట్రోల్స్‌ను నేను పట్టించుకోను.

ఇలాంటివి నా విజయాన్ని ఆపలేవు. మీరు నన్ను ఎంత ట్రోల్ చేసినా ఇతరుల లాగా డబ్బులు చెల్లించను. నేను ఐశ్వర్య రాయ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాఅనుకుంటున్నారా. ఒకరిలా ఉండటానికి నేను ఇండస్ట్రీకి రాలేదు. కేన్స్ నన్ను కలిసిపోవడానికి ఆహ్వానించలేదు. నేను ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్శణగా నిలబడటానికి వచ్చాను. నా లుక్, నా స్టైల్ మీకు అసౌర్యాన్ని కలిగిస్తే చూడకండి. నేను అందరికీ నచ్చేలా ఉండాలని అనుకోను. నేను బాణసంచా కాల్చిన షాంపైన్ లాంటిదాన్ని’’ అని రాసుకొచ్చింది. ఇక ఈపోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు అండగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం మళ్లీ ట్రోలింగ్ మొదలెట్టారు.

Next Story