అలాంటి బాధ ఎవ్వరికీ రాకూడదు.. Samantha

by Phanindra |   (  Updated:2023-01-27 11:09:30  IST  )

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా 'శాకుంతలం'

అలాంటి బాధ ఎవ్వరికీ రాకూడదు.. Samantha
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీగా ఉంది. ఫిబ్రవరి 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈవెంట్‌కు సమంత కూడా హాజరయ్యింది. చాలా గ్యాప్ తర్వాత సమంత మీడియా ముందుకు రావడంతో, ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఒక ట్విట్టర్ హ్యాండిల్ సమంతా చిత్రాలు షేర్ చేస్తూ 'ఆమె తన అందాన్ని, అలాగే మెరుపును కోల్పోయింది. ఆమె విడాకుల బాధ నుంచి బయటకు వచ్చిందని అందరూ భావించినప్పటికీ. మయోసైటిస్ ఆమెను తీవ్రంగా దెబ్బతీసింది' అని రాశారు. దీనికి సమంత స్పందిస్తూ, 'నా లాగా మీరునెలల తరబడి చికిత్స, మందులు తీసుకోకూడదని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ గ్లో‌ను పెంచడానికి నా వైపు నుంచి కొంత ప్రేమ ఉంది '. అంటూ బదులిచ్చింది.

ఇవి కూడా చదవండి : గుండే ఆపరేషన్‌కు రూ.15 లక్షలు విరాళం ఇచ్చిన Akshay Kumar

Also Read.. టాప్ సీక్రెట్ బయటకు లీక్ చేసిన Rashmika Mandanna

Next Story