Shah Rukh Khan నిజ స్వరూపం చూసి షాక్ అయ్యాను: Saddam

by Disha Web Desk 10 |
Shah Rukh Khan నిజ స్వరూపం చూసి షాక్ అయ్యాను: Saddam
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ క్యారెక్టర్‌పై ప్రముఖ స్టంట్ మ్యాన్ సద్దాం ప్రశంసలు కురిపించాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జవాన్’లో స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తున్న సద్దాం.. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారుక్ గొప్ప మనసున్న మనిషి అంటూ పొగిడేశాడు. ‘నేను స్టంట్స్ ఎలా చేస్తున్నానా అని ప్రతిసారి అడుగుతారు. నా భద్రతా, జాగ్రత్తల గురించి కూడా ఆరా తీస్తాడు. ప్రతి షాట్ తర్వాత నన్ను తనిఖీ చేస్తాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్లలో ఒకరైన షారూఖ్ స్వభావాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా అంత గొప్ప మనసున్న నటుడిని కలిగివున్నందుకు మనం గర్వంగా ఫీల్ అవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నయనతార, విజయ్ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న మూవీ సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ కానుంది.

Also Read..

గుడ్ న్యూస్ తీసుకొచ్చిన 1:29.. ఇండస్ట్రీకే పెద్ద పార్టీ ఇస్తున్న బిగ్ బాస్..!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed