యూత్ సెక్స్ కంటెంట్ కోరుకోవడం లేదా? మరి ఏం కావాలంటున్నారో తెలుసా..?

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-26 08:30:47  IST  )

సాధారణంగా యూత్ సెక్స్ కంటెంట్ కలిగిన టీవీ, సిరీస్, సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారని అనుకుంటాం.

యూత్ సెక్స్ కంటెంట్ కోరుకోవడం లేదా? మరి ఏం కావాలంటున్నారో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా యూత్ సెక్స్ కంటెంట్ కలిగిన టీవీ, సిరీస్, సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారని అనుకుంటాం. కానీ ఇది కరెక్ట్ కాదని చెప్తోంది తాజా అధ్యయనం. Gen Z ఎక్కువగా ఫ్రెండ్ షిప్ తో కూడిన సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని గుర్తించింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా 1500 మందిపై చేసిన అధ్యయనం ప్రకారం.. 47.5శాతం మంది మూవీస్ ప్లాట్ కి శృంగారం అవసరం లేదని భావిస్తున్నారు.

44.3% మంది రొమాన్స్ ను ఓవర్ యూజ్ చేస్తున్నారని అభిప్రాయపడుతుండగా.. 40% మంది నాన్ రొమాంటిక్ రిలేషన్స్, అసెక్సువల్ క్యారెక్టర్స్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. 51.5% స్నేహ మాధుర్యాన్ని అందించే సినిమాలను కోరుకుంటున్నారు.

స్కూల్, కాలేజీ స్నేహాలు కాకుండా.. ఊరి బయట కలిసే క్లోజ్ ఫ్రెండ్ బ్యాచ్ గురించి తెరపై చూడాలని ఆశ పడుతున్నారు. డిజిటల్ మీడియా ఫ్రెండ్స్, ఐడెంటిటీ స్టోరీగా వస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరికొందరు ఒక స్త్రీ జీవితంలో పడే గాయాలను చిత్ర రూపంలో చూడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు వచ్చి చాలా కాలం అయిందని అంటున్నారు.

Next Story