- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేకర్స్ కష్టాన్ని గౌరవించకుండా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. శివకార్తీకేయన్ సెన్సేషనల్ పోస్ట్
ప్రతి సినిమా వందలాది మంది రక్తం, చెమట మరియు అభిరుచితో తయారవుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండండి.

దిశ, సినిమా: దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయగన్’ చుట్టూ ఇప్పుడు వివాదాలు, టెన్షన్లు చుట్టుముట్టాయి. రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్‌కి ఇది ఆఖరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉండగా, ఊహించని విధంగా ఈ మూవీ షూటింగ్ ఫుటేజీ లీక్ అవ్వడం కోలీవుడ్‌లో పెను కలకలం రేపుతోంది. ఇప్పటికే సెన్సార్ సమస్యలతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇవన్నీ చాలవన్నట్లు, తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఏకంగా 5 నిమిషాల ముఖ్యమైన సీన్, విజయ్ ఇంట్రడక్షన్ సీన్, టైటిల్ కార్డ్స్, దళపతి కచేరీ అనే పాటలో కొంత భాగం లీక్ అయ్యాయి. మూవీ రిలీజ్ కాకముందే ఇంత పెద్ద ఎత్తున ఫుటేజీ బయటకు రావడంతో చిత్ర బృందం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వెంటనే రంగంలోకి దిగిన మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎడిటింగ్ టీమ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ నుంచే ఈ లీక్ జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ లీకేజీ వార్తలపై మరో స్టార్ హీరో శివకార్తీకేయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రతి సినిమా వందలాది మంది రక్తం, చెమట మరియు అభిరుచితో తయారవుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండండి. సినిమాను థియేటర్లలోనే చూసి గౌరవించండి. ఇలాంటి పనులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎదుటివారి కష్టాన్ని, ప్రతిభను గౌరవించడం నేర్చుకోండి" అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. విజయ్ సినిమా లీక్ పై శివకార్తీకేయన్ ఇంత వేగంగా స్పందించడం పట్ల దళపతి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తన తోటి హీరో కష్టానికి విలువ ఇచ్చి, పైరసీని ఖండించిన శివకార్తీకేయన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దళపతి విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఈ లీక్స్ చిత్ర బిజినెస్, క్రేజ్‌పై ప్రభావం చూపుతాయని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.






