ప్రేక్షకులను మభ్యపెట్టడం ఆపండి.. దర్శకులకు నవాజుద్దీన్ వార్నింగ్!

by Mallepaka Hamsa |

సినిమాల వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ప్రజలకు తెలుసు. జనం తెలివైన వాళ్లు, అన్నీ గమనిస్తున్నారు. కానీ ఎవరూ బయటకు చెప్పడం లేదు.

ప్రేక్షకులను మభ్యపెట్టడం ఆపండి.. దర్శకులకు నవాజుద్దీన్ వార్నింగ్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ హిందీ పరిశ్రమలో ప్రస్తుతం వస్తున్న సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్నవన్నీ ఫేక్ చిత్రాలని ఆయన చేసిన విమర్శలు పెద్ద చర్చకు దారితీశాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వస్తున్న కథల్లో అస్సలు నిజాయితీ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక రకమైన భావజాలాన్ని ప్రజల మీద రుద్దడానికే సినిమాలు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘సినిమాల వెనుక ఉన్న అసలు సత్యం ఏంటో ప్రజలకు తెలుసు. జనం తెలివైన వాళ్లు, అన్నీ గమనిస్తున్నారు. కానీ ఎవరూ బయటకు చెప్పడం లేదు’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.

మూవీ అనేది సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన ఆయుధమని, దాన్ని తప్పుడు దిశలో వాడకూడదని నవాజ్ హెచ్చరించారు. అబద్ధపు కథలతో ప్రేక్షకులను మభ్యపెట్టడం ఆపి, వాస్తవాలకు దగ్గరగా ఉండే సినిమాలు తీయాలని డైరెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయాల నేపథ్యంలో వచ్చే చిత్రాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా చెప్పారు. నవాజుద్దీన్ చివరిగా ‘రాత్ అకేలీ హై: ది బన్సల్ మర్డర్స్' తో హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఇలా ఇండస్ట్రీ మీద విరుచుకుపడటంతో, ఆయన టార్గెట్ చేసిన ఆ నకిలీ సినిమాలు ఏవి? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

Next Story