సింగర్ Mangli కారుపై రాళ్ల దాడి

by Disha Web Desk |
సింగర్ Mangli కారుపై రాళ్ల దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటకలోని బళ్లారిలో సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. శ‌నివారం రాత్రి బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో సింగర్ మంగ్లీ పాల్గొంది. ఈ సందర్భంగా ప్రోగ్రాం ముగించుకుని వస్తున్న సింగర్ మంగ్లీ కారుపై కొంతమంది యువకులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆమెను చూసేందుకు యువకులు ఎగబడ్డారు. వేదిక వెనక ఉన్న మేకప్ టెంట్ లోపలికి ప్రవేశించారు. వెంటనే పోలీసులు ఎంటర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మంగ్లీ వెళ్ళేటప్పుడు కొంతమంది యువకులు కారుపై రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల చిక్కబళ్లాపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా మంగ్లీ పాల్గొంది. ఈ సమయంలో మంగ్లీని యాంకర్ అనుశ్రీ వేదిక మీదకు పిలవగా... వేదికపైకి వచ్చిన మంగ్లీ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో చెప్పింది. ఇక్కడ కన్నడవారు ఉన్నారు. కన్నడలో మాట్లాడండి.. అని అనుశ్రీ చెప్పగా.. పక్కన అనంతపురం ఉంది. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ సమాధానమిచ్చింది. బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. ఈ క్రమంలో అనుశ్రీ కన్నడలో ప్రశ్న అడిగేటప్పుడు నాకు అర్థం కావడం లేదని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి : శ్రద్ధా హత్య కేసు: 3 వేల పేజీల ఛార్జిషీటు.!



Next Story

Most Viewed