- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటికీ ఆ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. ఇండస్ట్రీలోని అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం పలు టీవీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు.. వెండితెరపై వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్ముడు తన కెరీర్‌లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపింది.
‘బాడీ షేమింగ్, శరీర రంగు విషయంలో ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటున్నాను. అంతే కాకుండా ముస్తఫాతో పెళ్లికి ముందు మా నిశ్చితార్థ ఫొటోను సోషల్ మీడయాలో షేర్ చేసినప్పుడు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు, విమర్శించారు. ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌కు, విమర్శలకు నేనెప్పుడు బాధపడను వాటిని పట్టించుకోను. ఎందుకంటే ఇది నా లైఫ్. ఎవరితో జీవితాన్ని కొనసాగించాలనేది పూర్తిగా నా ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Also Read






