Superstar Krishna విగ్రహం రెడీ.. ఆవిష్కరించేది ఎక్కడో తెలుసా?

by Dishafeatures2 |
Superstar Krishna  విగ్రహం రెడీ.. ఆవిష్కరించేది ఎక్కడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఇక ఒకే ఏడాది అన్న, అమ్మ, నాన్న మృతి చెందడం హీరో మహేశ్ బాబును తీవ్ర విషాదంలోకి నెట్టింది. ముఖ్యంగా నాన్న సూపర్ కృష్ణ మరణం ఆయన బాగా కుంగదీసింది. అయితే రేపు (నవంబర్ 27) హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో కృష్ణ పెద్ద కర్మ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన రాజ్ కుమార్ అనే శిల్పి సూపర్ స్టార్ విగ్రహాన్ని తయారు చేశాడు. ఫైబర్ తో ఈ విగ్రహాన్ని తయారు చేశారని, దాదాపు విగ్రహ నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. రేపు జరగబోయే కార్యక్రమంలో కృష్ణ విగ్రహాన్ని మహేశ్ బాబుతో పాటు మిగతా కుటుంబ సభ్యులు ఆవిష్కరించనున్నారు.

READ MORE

సంగీతంతో ఇంట్లో ఒత్తిడి దూరం చేస్తాడు : అభిషేక్ కోడలు

Next Story