- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుక్ స్టెప్ ప్రాక్టీస్ షురూ చేయండి అబ్బాయిలు..మాస్ బీట్‌తో రాబోతున్నామంటూ అనన్య పాండే పోస్ట్
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి వచ్చిన అనన్య పాండే(Ananya Pandey) తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను రాబట్టుకుంది.

దిశ, సినిమా: స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి వచ్చిన అనన్య పాండే(Ananya Pandey) తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను రాబట్టుకుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ మూవీతో వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే క్రేజీ బ్యూటీగా మారి వరుస అవకాశాలు రాబట్టుకుంది. తెలుగు, హిందీ భాషల్లో నటించి మెప్పించిన అనన్య పాండే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ భామ ‘తూ మేరీ మై తేరా తూ మేరీ’ (TuMeriMainTeraMainTeraTuMeri )సినిమాతో రాబోతుంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సమీర్ విద్వాన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో అనన్య పాండే సరసన కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) హీరోగా చేస్తున్నారు. సమీర్, కార్తీక్ కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది.
ధర్మ ప్రొడక్షన్స్, నమ: పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్ మొదలెట్టిన చిత్రబృందం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ మేరకు ‘తూ మేరీ మై తేరా తూ మేరీ’ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ రాబోతున్నట్లు తెలుపుతూ అనన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. కొత్త బీట్ రాబోతుంది. అబ్బాయిలు హూక్ స్టెప్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మేము మాస్ సాంగ్‌తో ఫుల్ స్వాగ్‌లో మీ ముందుకు వస్తున్నాం’’ అనే క్యాప్షన్ జత చేస్తూ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ ఇస్ట్ ఆర్ వెస్ట్ అనన్య ఈస్ బెస్ట్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. అనన్య ఈ సినిమాతో పాటు ‘చాంద్ మేరా దిల్’ చేస్తోంది.
షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. ఇక ఆమె నటించిన తెలుగు సినిమా ఒకే ఒక్కటి అయినప్పటికీ దానివల్ల ఈ అమ్మడుకి విమర్శలు రావడం తప్ప పెద్దగా క్రేజ్ రాలేదు. అదేంటంటే.. అనన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘లైగర్’ ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో అనన్య బాలీవుడ్ చెక్కేసింది. ఇక తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయకుండా.. హిందీలో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. అలాగే తనను ఏదైనా అంటే.. నెటిజన్లకు స్ట్రాంగ్‌గానే కౌంటర్లు ఇస్తోంది.






