- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసి హైప్ పెంచేసిన రవితేజ
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ వారసులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ తమ టాలెంట్‌తో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంటున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీ వారసులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ తమ టాలెంట్‌తో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఇక ఇప్పుడు మాస్ మహారాజ్ బిరుదు అందుకున్న రవితేజ ఫ్యామిలీ నుంచి కూడా కొత్త హీరో పరిచయం కాబోతున్నారు. ఆయన తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ రాజ్ భూపతి(Madhav Raj Bhupathi) సినిమాల్లోకి వస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రవితేజ(Ravi Teja) ట్విట్టన్ ద్వారా షేర్ చేసి అంచనాలను పెంచారు. తనయుడికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ‘‘ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని త్యాగం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ‘మారెమ్మ’ టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇక ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. ఇందులో మాధవ్ భూపతి గల్ల చొక్కా ధరించి లుంగీ కట్టుకుని గుబురు గడ్డం, జుట్టుతో కోపంగా పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాడు. ఆయన వెనుక దున్నపోతు నిల్చొని కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచుతోంది. కాగా, ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ నాగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోక్ష ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఆగస్టులో రాబోతున్నట్లు తెలుస్తోంది.






