బీడీ వెలిగిస్తే తప్పేంటి.. గౌరవంగా ఫీల్ అవుతున్నానంటూ స్టార్ హీరో సంచలన కామెంట్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan)వరుస చిత్రాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు.

బీడీ వెలిగిస్తే తప్పేంటి..  గౌరవంగా ఫీల్ అవుతున్నానంటూ స్టార్ హీరో సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) వరుస చిత్రాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. భాషతో సంబంధం లేకుండా పలు స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు. ఇక ఇటీవల ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ‘కూలీ’ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర(Upendra) కీలక పాత్రలో నటించారు. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ ఊహించిన విధంగా ఘన విజయం సాధించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆమిర్ ఖాన్ నటనకు బాగానే మార్కులు పడ్డాయి. అలాగే పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ సంచలన కామెంట్స్ చేశాడు. ‘‘కూలీసినిమాలో నా క్యారెక్టర్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి బీడీ వెలిగించడం. నేను నిజాయితీగా చెబుతున్నాను అలా చేయడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను రజినీకాంత్ అభిమానిని కాబట్టి ఆయనతో స్క్రిన్ షేర్ చేసుకోవడం చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నా జీవితానికి అదొక మెమరీ అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు.

Next Story