తన హిట్ సినిమాకు నేషనల్ అవార్డు రాకపోవడంపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) గత ఏడాది నటించిన ‘ఆడు జీవితం’ (Aadujeevitham: The Goat Life )మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

తన హిట్ సినిమాకు నేషనల్ అవార్డు రాకపోవడంపై స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) గత ఏడాది నటించిన ‘ఆడు జీవితం’ (Aadujeevitham: The Goat Life )మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ‘ఎల్-2: ఎంపురాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల 71వ జాతీయ చలన చిత్ర అవార్డు పురస్కారాల జాబితాలో పృథ్వీరాజ్‌కు చోటుదక్కలేదు. తాజాగా, నేషనల్ అవార్డు రాకపోవడంపై ఓ పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ‘‘ఆడు జీవితం సినిమా విజయం అందుకోవాలని అనుకున్నాను.

అలాగే ప్రేక్షకులకు నా నటన నచ్చాలని ఆశించాను. ముఖ్యంగా నజీబ్ మహమ్మద్ గురించి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో ఆ మూవీ చేశాం. ఇలా నేను అనుకున్న వన్నీ జరిగాయి. అంతకుమించి ఆ సినిమా విషయంలో నేను ఆశించేదేం లేదు. ఒకవేళ అవార్డు వచ్చి ఉంటే చాలా సంతోషపడేవాన్ని. జాతీయ అవార్డుకు ఎంపికైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా..ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ విభిన్న కథలు ఎంచుకుంటున్నారు. తెలుగులో ఆయన ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘SSMB-29’ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Next Story