స్టార్ హీరోయిన్ కొత్త వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ తేదీ ఖారారు.. పోస్టర్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన తమన్నా

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannah Bhatia)తెలుగు హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంది.

స్టార్ హీరోయిన్ కొత్త వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ తేదీ ఖారారు.. పోస్టర్‌తోనే క్యూరియాసిటీ పెంచేసిన తమన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannah Bhatia)తెలుగు హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇటీవల ‘ఓదెల-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఓ హారర్ థ్రిల్లర్‌తో రాబోతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra)తో ‘వ్యన్-ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ లో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మే 15న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో పాటు ఓ అడల్ట్ మూవీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే.. తాజాగా, తమన్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది.

‘డు యూ వనా పార్ట్‌నర్’(Do you wanna partner) స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించింది. ఇందులో తమన్నాతో పాటు డయానా పెంటీ (Diana Penty) నటించింది. అర్చిత్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సిరీస్‌ను బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ నిర్మించారు.పురుష ఆదిపత్యం ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇద్దరు మహిళలు ఎలాంటి సమస్యలు ఎదర్కొంటారనే కాన్సెప్ట్‌తో రాబోతుంది. అయితే ఈ సిరీస్ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తమన్నా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేయడంతో అది కాస్త ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story